50మంది మహిళలపై సైకో అత్యాచారం

nanireddy
Updated on: 24 Dec 2018 4:38 PM IST
50మంది మహిళలపై సైకో అత్యాచారం
X

ఒకరు కాదు ఇద్దరుకాదు.. ఏకంగా యాభైమంది మహిళలపై ఆ మృగాడు అత్యాచారాలకు పాల్పడ్డాడు. సైకోగా మారి ఒంటరిగా వెళుతున్న మహిళలను భయపెట్టి అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబత్తూరు కు చెందిన అరివలగన్‌ కొంతకాలంగా మానసిక రోగిగా మారాడు. దాంతో రోడ్డుమీద ఒంటరిగా వెళుతున్న మహిళలను బెదిరించి అత్యాచారం చేస్తూ, ఆ దృష్యాలను తన సెల్‌ ఫోన్‌లో రికార్డు చేసేవాడు. ఆ వీడియోలతో మహిళలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ పలుమార్లు వాళ్లపై లైంగికదాడి చేసేవాడు. దాంతో అతడి చేష్టలకు బలైన కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అరివలగన్‌ అదుపులోకి తీసుకున్నారు. కాగా నేరస్తుడి సెల్‌ ఫోన్‌లో సుమారు 50 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

nanireddy

nanireddy

Next Story