Top
logo

హైదరాబాద్‌లో ట్రిపుల్ మర్డర్ కలకలం!

హైదరాబాద్‌లో ట్రిపుల్ మర్డర్ కలకలం!
X
Highlights

హైదరాబాద్‌ నగరంలోని మీర్‌పేటలో ట్రిపుల్ మర్డర్ కలకలం సృష్టించింది. కట్టుకున్న భార్యతో పాటు కన్నబిడ్డలు...

హైదరాబాద్‌ నగరంలోని మీర్‌పేటలో ట్రిపుల్ మర్డర్ కలకలం సృష్టించింది. కట్టుకున్న భార్యతో పాటు కన్నబిడ్డలు ఇద్దర్నీ హతమార్చాడో దుర్మార్గుడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే..నగరంలోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల జిల్లెలగూడ సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో ఈ దారుణం జరిగింది. హరీందర్‌గౌడ్ అనే వ్యక్తి తన భార్య జ్యోతి, కుమారుడు అభిజిత్(6), కూతురు సహస్ర(4)లను దారుణంగా హత్య చేశాడు. భార్యను గోడకేసి బలంగా కొట్టి, పిల్లల గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మీర్‌పేట పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story