పరువుకోసం బావను చంపిన బావమరిది

పరువుకోసం బావను చంపిన బావమరిది
x
Highlights

కులం వారి మధ్య చిచ్చు పెట్టింది. అక్క వేరే కులం వ్యక్తిని పెళ్లిచేసుకుందన్న కోపంతో బావను అంతమొందించాడు బావమరిది. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. బెంగళూరు...

కులం వారి మధ్య చిచ్చు పెట్టింది. అక్క వేరే కులం వ్యక్తిని పెళ్లిచేసుకుందన్న కోపంతో బావను అంతమొందించాడు బావమరిది. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. బెంగళూరు నగర శివార్లలోని బిదలూరుకు చెందిన హరీష్ క్యాబ్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. నల్లూరు గ్రామానికి చెందిన మీనాక్షి, హరీష్ ఇద్దరూ కలిసి చదువుకున్నారు. దాంతో చదువుకునే రోజుల్లోనే వారిమధ్య ప్రేమ చిగురించింది. అయితే హరీష్ ఎస్టీ కులం కాగా బీసీ కులానికి చెందిన మీనాక్షిని హరీష్ కు పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. దాంతో 8 నెలల కిందట హరీష్, మీనాక్షిలిద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అక్క కారణంగా తమ కుటుంబ పరువు పోయిందని.. అందుకు కారణమైన హరీష్ ను హత్య చెయ్యాలని వినయ్ ప్లాన్ వేశాడు. అందులో భాగంగా ఇటీవల వారిని నల్లూరులోని ఇంటికి రమ్మని చెప్పి హరీష్ ను అతని బావమరిది వినయ్ పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత హరీష్ గొంతు కోసి చంపాడు. అనంతరం పరువు కోసమే బావను అంతమొందించినట్టు చెప్పి0 వినయ్ పోలీసులకు లోగిపోయాడు. కాగా హరీష్ శవాన్ని పోస్టుమార్టం చేయించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories