చేతి నుంచి జారిపడిన సెల్‌ఫోన్...రైలు నుంచి దూకేసిన యువకుడు

x
Highlights

యువత సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారుతోంది. సెల్‌ఫోన్‌ లేకుండా ఒక్క క్షణం కూడా గడపని పరిస్థితి నెలకొంది. ప్రాణాలు పోతున్నా...స్మార్ట్‌ఫోన్‌ను మాత్రం వదలడం...

యువత సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారుతోంది. సెల్‌ఫోన్‌ లేకుండా ఒక్క క్షణం కూడా గడపని పరిస్థితి నెలకొంది. ప్రాణాలు పోతున్నా...స్మార్ట్‌ఫోన్‌ను మాత్రం వదలడం లేదు. చెన్నై నుంచి ఒడిషా వెళ్తున్నాడు కేదారీనాథ్‌. భోగి డోర్‌ వద్ద కూర్చోని ఫోన్‌లో మాట్లాడుతుండగా... ద్వారపూడి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఫోన్‌ కింద పడిపోయింది. దీంతో కేదారీనాథ్‌...కదిలే ట్రైన్‌లో నుంచి ఫోన్‌ కోసం దూకేశాడు. తీవ్రంగా గాయపడటంతో స్థానికులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేదారీనాథ్‌ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఒడిషాలోని నౌపాడ జిల్లా పాసుర గ్రామానికి చెందిన కేదారీనాథ్‌...చెన్నైలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. ద్వారపూడి సమీపంలో భోగి డోరు వద్ద కూర్చోని స్నేహితులతో మాట్లాడుతుండగా...ఫోన్‌ కింద పడిపోయింది. ఏ మాత్రం ఆలోచించని కేదారీనాథ్‌...ఫోన్‌ కోసం స్పీడ్‌గా వెళ్తున్న ట్రైన్‌లో దూకేశాడు. రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేదారీనాథ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories