బేగం పేట పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఉన్మాదం
బేగంపేటలో పోలీస్ స్టేషన్ లో దారుణం వెలుగుచూసింది. రెహ్మాన్ అనే వ్యక్తి.. పోలీస్‌స్టేషన్‌లో చొరబడి…. ఆయన కుటుంబసభ్యులైన ఐదుగురిపై విచక్షణారహితంగా కొబ్బరిబోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతకొంతకాలంగా రెహమాన్ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న అతని కుటుంబసభ్యులు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన భార్య, అత్తమామ లు పోలీస్ స్టేషన్ కు రావడంతో రెహ్మాన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Next Story




