‘జనతాగ్యారేజ్’ అంటూ కత్తితో యువకుడి హల్‌చల్

‘జనతాగ్యారేజ్’ అంటూ కత్తితో యువకుడి హల్‌చల్
x
Highlights

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్‌ క్రిమినల్స్‌కు అడ్డాగా మారిపోయింది. ఇవాళ ఉదయం ఓ వ్యక్తి ఉండవల్లి సెంటర్‌లో ప్రదీప్‌ అనే యువకుడు కత్తితో...

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్‌ క్రిమినల్స్‌కు అడ్డాగా మారిపోయింది. ఇవాళ ఉదయం ఓ వ్యక్తి ఉండవల్లి సెంటర్‌లో ప్రదీప్‌ అనే యువకుడు కత్తితో హల్‌ చల్‌ చేశాడు. రోడ్డుపైనే కత్తి చేతపట్టుకుని తిరుగుతూ మొబైల్‌లో మాట్లాడుతూ రావాలని పిలుస్తూ హంగామా చేశాడు. అతనితో పాటు పలువురు వ్యక్తులు వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది.

జనతా గ్యారేజ్‌ పేరుతో ప్రదీప్‌ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జనతా గ్యారేజ్‌ పేరుపై వాట్సాప్‌ గ్రూప్‌ సృష్టించి సమస్యేదైనా తాము చూసుకుంటామంటూ జనాల్లో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ సమాచారం అందుకున్నపోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై అడీషనల్‌ ఎస్పీ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories