చాటింగ్‌ ఛీటర్‌...ఎఫ్‌బీలో అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు..

x
Highlights

సోషల్‌గా మూవ్‌ అవుదామని కామన్‌గా సోషల్‌ మీడియాలోకి వచ్చే మహిళలూ.. జాగ్రత్త. నెట్టింట్లో చీటింగ్‌ నెట్‌ వేసే గ్రంధ సాంగులు చాలానే మందే ఉన్నారు....

సోషల్‌గా మూవ్‌ అవుదామని కామన్‌గా సోషల్‌ మీడియాలోకి వచ్చే మహిళలూ.. జాగ్రత్త. నెట్టింట్లో చీటింగ్‌ నెట్‌ వేసే గ్రంధ సాంగులు చాలానే మందే ఉన్నారు. అపరిచితులతో స్నేహం అవసరమా అని ఒకటికి పది సార్లు ఆలోచించుకొనేలా చేస్తున్నారీ మోసగాళ్లు. ఫేస్‌ బుక్‌లో బుక్కయ్యే లేడీస్‌ ఎందరో? బుక్‌ చేసే కిలాడీలెందరో? తాజాగా అలాంటి చీటింగ్‌ ఛాటర్‌ను పోలీసులు కటకటాలు లెక్క పెట్టిస్తున్నారు.

సామాజిక మాథ్యమాల్లో ఈ మధ్య మోసగాళ్లు ఎక్కువై పోతున్నారు. సోషల్‌గా మూవ్‌ అవుతున్న అమ్మాయిలు, మహిళలను టార్గెట్‌ చేసుకొని వలపు పేరుతో వల వేసే కేటుగాళ్లకు కొదవ లేదు. కాస్త అందంగా కనిపిస్తే చాలా అమ్మాయిల యాడ్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపడం, నెమ్మదిగా హాయ్‌ అని ఛాటింగ్‌ మొదలెట్టి ముగ్గులోకి దింపుతున్నారు. తెలివైన మోసగాళ్ల బారిన పడి కొంత మంది అమ్మాయిలు తేలిగ్గా మోసపోతున్నారు. అంతా అయ్యాక.. లబోదిబో మని పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కుతున్నారు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రంగస్వామి.. మంచి గ్రంధ సాంగుడు. ఉండేది అనంతపురంలో. ఇతగాడు.. ఫేస్‌బుక్‌లో ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసి.. స్లోగా మూవ్‌ అవుతాడు. అమాయకంగా కనిపించే మహిళలతో ఛాటింగ్‌ స్టార్ట్‌ చేస్తాడు. మాయ మాటలు చెబుతాడు. తనకింకా పెళ్లి కాలేదని, చక్కటి తోడు కోసం చూస్తున్నట్లు నమ్మబలుకుతాడు. కంటికి కాస్తా నదురుగా కనిపిస్తుండడంతో కొంతమంది అమ్మాయిలు ఈ మోసగాడి బారిన పడ్డారు. కేవలం ఫేస్‌ బుక్‌ ద్వారానే పదిమంది మహిళలను బుక్‌ చేశాడీ మాయగాడు.

ఎంత మోసమైనా ఎంతో కాలం దాగదు. ఈ రంగస్వామి మోసం కూడా బయట పడింది. హైదరాబాద్‌కి చెందిన ఓ యువతిని ఇలానే లోబర్చుకొనే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయాడు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు రాచకొండ పోలీసులు అనంతపురం వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో రంగస్వామిని అదుపులోకి తీసుకున్నారు. రంగస్వామిపై గతంలోనే ఇలాంటి కేసులు పది వరకు ఉన్నట్లు అనంతపురం పోలీసులు చెప్పడంతో రాచకొండ పోలీసులు ఖంగు తిన్నారు. ఫేస్‌బుక్‌ చీటర్‌ రంగస్వామిని హైదరాబాద్‌ తీసుకొచ్చి విచారణ షురూ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories