అలిగిన మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది

అలిగిన మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది
x
Highlights

వైసీపీ శిక్షణా తరగతుల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలిగారు. తనకు స్టేజ్‌పైకి ఆహ్వానం రాకపోవడంతో ఆయన స్టేజ్‌పైకి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో...

వైసీపీ శిక్షణా తరగతుల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలిగారు. తనకు స్టేజ్‌పైకి ఆహ్వానం రాకపోవడంతో ఆయన స్టేజ్‌పైకి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయనను బుజ్జగించారు. అయినా వినని విష్ణు సాధారణ కార్యకర్తలాగే కిందనే ఉండిపోయారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే ఆయన అలాంటిదేమీ లేదని చెప్పారు.

మరోవైపు వంగవీటి రాధా అనుచరులు నానా హంగామా సృష్టించారు. రాధాను సమావేశానికి ఎందుకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై రాధా, జై రంగా అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒకింత అసహనానికి గురైన మల్లాది విష్ణు..ఆపండయ్యా అంటూ వారించారు. రాధాని రెండు రోజులుగా పిలుస్తున్నామని, కాసేపట్లో వస్తారని సామినేని ఉదయభాను సముదాయించారు. మొత్తం మీద వంగవీటి రాధా ఆలస్యంగానైనా సమావేశానికి రావడంతో గందరగోళం సద్దుమణిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories