కేరళ పర్యటక శాఖ మంత్రి ట్విస్ట్

కేరళ పర్యటక శాఖ మంత్రి ట్విస్ట్
x
Highlights

మన బాహుబలి ప్రభాసే బెస్ట్, కేరళ పర్యటక శాఖ మంత్రి ట్విస్ట్, హీరో ప్రబాసుని పొగిడగానే ఫస్ట్, కేరళ హీరోలకి క్లాసు తీసుకొనే నెక్స్ట్. శ్రీ.కో. కేరళ...

మన బాహుబలి ప్రభాసే బెస్ట్,

కేరళ పర్యటక శాఖ మంత్రి ట్విస్ట్,

హీరో ప్రబాసుని పొగిడగానే ఫస్ట్,

కేరళ హీరోలకి క్లాసు తీసుకొనే నెక్స్ట్. శ్రీ.కో.


కేరళ పర్యటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ మన హీరో ప్రబాసుని పొగిడి, కేరళ హీరోలకి క్లాసు తీసుకున్నారు. టాలీవుడ్ హీరో ప్రభాస్ ని చూసి వారంతా నేర్చుకోవాలని. భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ అల్లాడిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఎందరో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆర్థికంగా సాయం చేశారు. అయితే మలయాళ నటులకంటే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలే ఎక్కువ నగదు సాయం చేశారని సురేంద్రన్‌ అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రంలో ఎందరో సూపర్‌స్టార్లు ఉన్నారు. ప్రతీ సినిమాకు రూ.4 కోట్లు పారితోషికంగా తీసుకుంటారని విన్నాను. వారంతా ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి. ఆయన మలయాళ సినిమాల్లో నటించింది లేదు. అయినప్పటికీ కేరళ బాధితుల కష్టాలు చూడలేక కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదు. కేరళ వరదల గురించి తెలిసిన వెంటనే సాయం చేయడానికి ముందుకొచ్చారు" అని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories