logo
సినిమా

ప్రేమపక్షుల ప్రణయగాధ పెళ్లితో పరిసమాప్తం

ప్రేమపక్షుల ప్రణయగాధ పెళ్లితో పరిసమాప్తం
X
Highlights

ప్రేమపక్షుల ప్రణయగాధ పెళ్లితో పరిసమాప్తం అయింది. నటి శ్వేతా బసుప్రసాద్‌ వివాహం రోహిత్‌ మిట్టల్‌ తో గురువారం...

ప్రేమపక్షుల ప్రణయగాధ పెళ్లితో పరిసమాప్తం అయింది. నటి శ్వేతా బసుప్రసాద్‌ వివాహం రోహిత్‌ మిట్టల్‌ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఐదేళ్ల కిత్రం ముంబైలో ఫాంటమ్‌ ఫిల్మ్స్‌లో శ్వేతా బసుప్రసాద్‌ పని చేస్తున్నప్పుడు... రోహిత్‌ ఆమెకు పరిచయం అయ్యారు. ఆ తరువాత మూడేళ్లకు ఇద్దరిమధ్య ఉన్న ప్రేమను ఒకరికొకరు చెప్పుకున్నారు. అయితే వీరి వివాహానికి మొదట కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దాంతో ఇద్దరు కొంతకాలం సహజీవనం చేశారని అప్పట్లో రూమర్లు వచ్చాయి. అయితే ఇటీవల శ్వేతా, రోహిత్ ల వివాహానికి కుటుంబసభ్యులు పచ్చజెండా ఊపడంతో గురువారం వివాహం జరిగింది. కాగా ఈ వివాహానికి కుటుంబసభ్యులు, సన్నిహితులు మినహా ఇతరులెవ్వరు హాజరుకాలేదని సమాచారం.

Next Story