భ‌ర‌త్ అనే నేను' ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్

x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న భరత్ అనే నేను సినిమాలో తొలిపాట విడుదలైంది. ఏప్రిల్ 20న విడుదలవుతున్న ఈ మూవీ ప్రమోషన్ పై...

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న భరత్ అనే నేను సినిమాలో తొలిపాట విడుదలైంది. ఏప్రిల్ 20న విడుదలవుతున్న ఈ మూవీ ప్రమోషన్ పై చిత్ర యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. టైటిల్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఫస్ట్ ఓథ్ పేరుతో ఓ వీడియో, టీజర్ ని విడుదల చేసి ప్రేకక్షల్ని ఆట్రాక్ట్ చేశారు. ఇఫ్పుడు దేవి శ్రీ స‌మ‌కూర్చిన తొలి బాణీ విడుద‌లైంది. ఈ సాంగ్ మ‌హేష్ ఫ్యాన్స్‌ని అల‌రిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ రూపొందుతుంది. ఇందులో మహేష్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుత విద్యా విధానం.. దానిని ఓ యువ ముఖ్యమంత్రి ఏ విధంగా మార్చాడు అనే దానిపై సినిమా నడుస్తుందున్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories