చీమలదండులా కదిలిన ఎర్రదండు

చీమల దండు అని వినడమేగానీ ఎవరూ చూసి ఉండరు. మహారాష్ట్రలో రైతులు అచ్చం చీమల దండులా కదిలారు. సమస్యల పరిష్కారం కోసం ...
చీమల దండు అని వినడమేగానీ ఎవరూ చూసి ఉండరు. మహారాష్ట్రలో రైతులు అచ్చం చీమల దండులా కదిలారు. సమస్యల పరిష్కారం కోసం పదం పదం కలిపారు. పోరు బాట పట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్ రైతులు భారీ ఆందోళన చేపట్టారు. నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో దాదాపు 30 వేలకు పైగా అన్నదాతలు పాల్గొంటున్నారు.
180 కిలోమీటర్లు ఏడు రోజులు. అసెంబ్లీ ముట్టడి. ఇది మహారాష్ట్రలో ఎర్రదండు లక్ష్యం. సీపీఎం అనుబంధ సంస్థ అఖిల భారతీయ కిసాన్ సభ ఈ భారీ ర్యాలీ చేపట్టింది. ఈనెల 6న నాసిక్ నుంచి మొదలైన రైతుల ర్యాలీ 12వ తేదీ నాటికి ముంబై చేరుకుంటుంది. ఎర్రదండు నాసిక్ నుంచి ముంబైకి నడుచుకుంటూ వెళ్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి అక్కడికి చేరుకొని ఆందోళన చేయాలని భావిస్తోంది. మహారాష్ట్ర శాసన సభను ముట్టడించబోతున్నారు.
పగలంతా ముంబయి-ఆగ్రా జాతీయ రహదారి వెంట నడుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాత్రుళ్ళు రోడ్ల పక్కనే సేదతీరుతూ మహారాష్ట్ర రైతన్నలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా రైతులను చైతన్య పరుస్తోంది అఖిల భారతీయ కిసాన్ సభ.
పంట రుణమాఫీ, విద్యుత్ బిల్లుల మాఫీ , పాల ధర పెంపు, పంట నష్టపోయిన రైతులకు పరిహారం , స్వామినాథన్ కమిషన్ సిఫార్పుల అమలు ఇవీ అఖిల భారతీయ కిసాన్ సభ డిమాండ్లు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 1753మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రైతు సంఘం నేతలు చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో ముంబైలో అసెంబ్లీని ముట్టడించి అన్నదాతలు సత్తా చూపుతామంటున్నారు. రైతులకు రుణమాఫీ చేసి న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆల్ ఇండియ కిసాన్ సభ హెచ్చరిస్తోంది.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT