లోక్‌సభ లెక్కలు...వీళ్లే ఫ్రైడే ఫైట్‌లో కీలకం

లోక్‌సభ లెక్కలు...వీళ్లే ఫ్రైడే ఫైట్‌లో కీలకం
x
Highlights

శుక్రవారం జరగబోయే నో కాన్ఫిడెన్స్ ఫైట్‌కు పార్టీలు రెడీ అయ్యాయి. పార్టీల బలబలాలను ఓసారి పరిశీలిస్తే లోక్‌సభలో ఖాళీ అయిన 8 స్థానాలు పోగా.. ప్రస్తుతం...

శుక్రవారం జరగబోయే నో కాన్ఫిడెన్స్ ఫైట్‌కు పార్టీలు రెడీ అయ్యాయి. పార్టీల బలబలాలను ఓసారి పరిశీలిస్తే లోక్‌సభలో ఖాళీ అయిన 8 స్థానాలు పోగా.. ప్రస్తుతం 535 మంది ఎంపీలున్నారు. వీరిలో అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే మేజిక్ ఫిగర్ 268 మంది మద్దతు కావాలి. 535 సభ్యుల్లో ఎన్డీయే కూటమికి 311 మంది సభ్యుల బలం ఉంది.

మేజిక్ ఫిగర్‌కు 268 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా బీజేపికి సొంతంగానే 271 మంది ఎంపీలున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఎన్డీయేతర, యూపీయేతర పార్టీలన్నింటికి కలిపి 225 మంది సభ్యులున్నారు. వీరిలో కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ అవిశ్వాసానికి ఎవరెవరు మద్దతిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఎన్డీయే కూటమిలోని బీజేపీ, శివసేన, ఎల్జేపీ, అకాళీదళ్‌తో పాటు 12 మంది ఇతర పార్టీల ఎంపీలు వ్యతిరేకంగా ఉన్నారు. అవిశ్వాసానికి అనుకూలంగా కాంగ్రెస్, టీఎంసీ, టీడీపీ, సీపీఎం, ఎన్సీపీ, ఎస్పీతో పాటు ఇతర పార్టీలకు చెందిన 24 మందితో కలిపి ఇప్పటివరకు మొత్తం 145 మంది ఎంపీలున్నారు.

అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీజేడీతో పాటు ఇతర పార్టీలకు చెందిన 9 మంది ఎంపీలు కలుపుకొని 80 మంది ఎంపీలు తటస్థంగా ఉన్నారు. వీళ్లే ఫ్రైడే ఫైట్‌లో కీలకం కాబోతున్నారు. శుక్రవారం నాటికి వీళ్లు ఎవరి వైపు ఉంటారన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

తమకు సంఖ్యాబలం లేదని ఎవరు చెప్పారని ఇప్పటికే సోనియా కామెంట్ చేశారు. దీనిని బట్టి చూస్తే శుక్రవారం నాటికి నెంబర్స్ మేజిక్ జరిగే చాన్స్ ఉంది. కాంగ్రెస్ బలం పెరగడం కానీ బీజేపీ బలం కాస్త తగ్గడం గానీ జరిగే అవకాశం ఉంది. అప్పటికి సీన్ ఎలా మారబోతుందన్నదే ఇప్పుడు అంతటా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories