జగన్‌కు మురళీమోహన్ కోడలు సవాల్

x
Highlights

వైఎస్ జగన్ తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని టీడీపీ ఎంపీ మురళీమోహన్ కోడలు రూప డిమాండ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...‘చంద్రబాబు...

వైఎస్ జగన్ తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని టీడీపీ ఎంపీ మురళీమోహన్ కోడలు రూప డిమాండ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...‘చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న భూములను, తమకు కేటాయించిందని జగన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె చెప్పారు. ఆ భూములు రైతులవి కావు.. అవి ఏపీఐఐసీ భూములు. ఆ భూములను అలీఫ్ అనే ఒక ఆర్గనైజేషన్‌కు కేటాయించారు. జగన్ గారు చెబుతున్నట్టు యాభై, అరవై ఎకరాలు కాదు. 34.5 ఎకరాలు. అలీఫ్ సంస్థకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. అలీఫ్ అనేది సోషల్ ఆర్గనైజేషన్. దానికి ఓ వెబ్ సైట్ ఉంది. తమపై చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఆమె ఛాలెంజ్ విసిరారు. ఏపీకి ఇంకో పదేళ్లు మంచి ప్రతిపక్ష నేత కావాలని ఆమె అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తనకు ప్రభుత్వ భూమి ఉన్నట్టు నిరూపిస్తే, తనపై ఏ కేసులకైనా సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు. రాజమండ్రి బలభద్రపురంలో తనకు ప్రభుత్వ స్థలం ఇస్తానన్నా వద్దన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories