ప్రేమ గెలిచింది....అందరి ప్రార్థనలు ఫలించాయి

x
Highlights

ప్రేమ గెలిచింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమికుల్ని బలి తీసుకుందామనుకున్న పెద్దల యత్నం విఫలమైంది. తండ్రి కర్కశ దాడిలో గాయపడిన చావు బతుకుల్లో...

ప్రేమ గెలిచింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమికుల్ని బలి తీసుకుందామనుకున్న పెద్దల యత్నం విఫలమైంది. తండ్రి కర్కశ దాడిలో గాయపడిన చావు బతుకుల్లో కొట్టుమిట్టాడిన మాధవి ప్రాణగండం నుంచి బయటపడింది. మరోవైపు అఘాయిత్యానికి మాధవి తండ్రికి కోర్టు రిమాండ్ విధించింది.

అందరి ప్రార్థనలు ఫలించాయి. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవి ఆరోగ్యం మెరుగు పడుతోంది. మాధవికి వెంటిలేటర్ తొలగించినట్లు డాక్టర్లు ప్రకటించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు ప్రకటించిన ఆరు గంటల తర్వాత ఆమె కోలుకుంటోందంటూ గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే సొంత మామ చేతిలో కత్తి దాడికి గురైన మాధవి భర్త సందీప్ పూర్తిగా కోలుకున్నాడు.

తండ్రి కత్తి వేటు వేయడంతో మాధవి ముఖకవళికలకు సంబంధించిన నరాలు, మెదడుకు వెళ్లే ప్రధాన నరం, ఎడమ చేయి ఎముక పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆమెకు మెడ, చేతి దగ్గర మూడు సర్జరీలు చేశారు. ఎముక తెగిపోయిన చర్మం మాత్రమే వేలాడుతున్న ఎడమ చేతిని ఆపరేషన్ చేసి అతికించారు. గాయాల నుంచి తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆరు బాటిళ్ల రక్తాన్ని ఎక్కించారు. మొదట్లో ఆమె కడిషన్ సీరియస్‌గానే ఉన్నా అనుకున్న సమయం కంటే త్వరగా కోలుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న మాధవి స్పృహలోకి వచ్చిందని కుటుంబ సభ్యులను గుర్తు పడుతోందని యశోద డాక్టర్లు చెప్పారు. ఆమె మాట్లాడగలుగుతోందని తెలిపారు. మాధవికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకపోతే రెండు మూడు రోజుల్లో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి తరలిస్తామని చెప్పారు.

కన్న కూతురిపై పాశవికంగా దాడి చేసిన మనోహరాచారికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తొందరపడి తప్పు చేశానని అతను అంగీకరించాడు. తన ఉద్దేశం ఎవర్నీ చంపడం కాదనీ బెదిరించడమేననీ చెప్పుకొచ్చాడు. తన కూతురు బతకాలని మనోహరాచారి కోరుకున్నాడు. మాధవిని ఎమ్మార్పీఎస్, బహుజన సంఘం నేతలతో పాటు పలు పార్టీల నాయకులు పరామర్శించారు. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి రక్షణ కల్పించే చట్టం చేయాలంటూ కుల సంఘాలు ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories