ఆసుపత్రి నుంచి మాధవి డిశ్చార్జ్

nanireddy
Updated on: 24 Dec 2018 3:31 PM IST
ఆసుపత్రి నుంచి మాధవి డిశ్చార్జ్
X

ప్రేమ పెళ్లి చేసుకుని, తండ్రి చేతిలో దారుణంగా గాయపడ్డ మాధవి ఎట్టకేలకు కోలుకుంది. ఇవాళ (బుధవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. బోరబండకు చెందిన మాధవి అదే ప్రాంతానికి చెందిన సందీప్ ను ప్రేమ వివాహం చేసుకుంది. దాంతో మాధవిపై కక్ష పెంచుకున్న తండ్రి మనోహరాచారి గత నెల 19న విచక్షణా రహితంగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మాధవి తీవ్రంగా గాయపడింది. ఆమె భర్త సందీప్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మాధవి చెవి, కుడిచేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగు పడిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా కన్నకూతురిపై దాడి చేసిన మనోహరాచారి ప్రస్తుతం జైలులో నిందితుడిగా ఉన్నాడు. అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌‌ను కోర్టు తోసిపుచ్చింది.

nanireddy

nanireddy

Next Story