Top
logo

మాటలతో చెడుగుడు...

X
Highlights

ఆయన మాటల రచయితే కాదు. పదాలతో ఆడుకుంటారు ఎదుటి వారు ఒక మాట వదిలారంటే దానికి కౌంటర్ ఇవ్వాల్సిందే. ఎదుటి వ్యక్తి...

ఆయన మాటల రచయితే కాదు. పదాలతో ఆడుకుంటారు ఎదుటి వారు ఒక మాట వదిలారంటే దానికి కౌంటర్ ఇవ్వాల్సిందే. ఎదుటి వ్యక్తి ఏ స్థాయి వాడయినా జంకరు, బెదరరు కరుణ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన మాటల ధోరణికి ఎన్నో సాక్ష్యాలు స్మృతుల్లా మిగిలిపోతాయి.

డిఎంకే అధినేత కరుణానిధి మాటల మాంత్రికుడు. చురకత్తి లాంటి భాష వాడటంలోనూ, ఎదుటి వారిపై పంచ్ లేయడంలోనూ ఆయనకెవరూ సాటిరారు ఆంగ్లలో, తమిళంలోనూ కరుణానిధిలో మాటల యుద్దంలో ఎవరూ నెగ్గలేరు ఇందుకు చరిత్రే సాక్ష్యం. ఛలోక్తులు, సెటైర్లు, విమర్శలు, చమత్కారాలు, విరుపులు సమయానికి తగ్గట్లుగా ఆయన నోటి వెంట వచ్చేస్తాయి. మాటల రచయిత కావడంతో ఆయన పదాలతో, అనర్గళమైన భాషా పటిమతో పంచ్ లేస్తుంటే ఎదుటి వారు నోరెళ్ల బెట్టాల్సిందే. అది1969లో మాట. తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై చనిపోయి నెల్లాళ్లయింది. ఆయన స్థానంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కరుణానిధి అప్పటి డిప్యూటీ ప్రధాని మొరార్జీని కలిశారు ఆర్థిక శాఖ చూస్తున్న మొరార్జీతో కరువు సహాయం కింద రాష్ట్రానికి 5 కోట్ల సాయమడిగారు. అయితే నా ఇంటి పెరట్లో చెట్లకి డబ్బులేం కాయట్లేదు. ఎక్కడనుంచి తెచ్చివ్వాలి డబ్బు అని మొరార్జీ ప్రశ్నించారు దానికి ఏ మాత్రం తొట్రు పడకుండా మీ ఇంట్లో చెట్లకు డబ్బులు కాయకపోతే మీ పెరట్లో అవెందుకున్నాయంటూ ఎదురు ప్రశ్నించారు.

1971 ఎన్నికల్లో డిఎంకే ఇందిర సారధ్యంలోని కాంగ్రెస్ ఆర్ తో పొత్తు పెట్టుకుంది. సీట్ల సర్దుబాటు సందర్భంగా కరుణానిధి కేవలం 15 సీట్లు ఆపార్టీకి ప్రతిపాదించారు కోపగించిన కాంగ్రెస్ నేతలు ఇది మా ఆత్మగౌరవానికే పరీక్ష అంటూ ఊగిపోయారు ఆవెంటనే కరుణానిధి మా ఉద్యమమే ఆత్మగౌరవ నినాదంతో పుట్టిందంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటిదే మరో ఘటన.

నాలుగేళ్లు ఇందిరాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించాక ఆ పార్టీతోనే పొత్తు కుదుర్చుకోవాల్సి వచ్చింది కరుణానిధికి. ఇందిరాగాంధీ ఇంటికి వెళ్లిన కరుణానిధితో ఆమె మనం కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం అని ఆహ్వానించారు. ఏ మాత్రం తొట్రు పడని కరుణానిధి లేదు లేదు మనం పాత అధ్యాయాన్ని కొనసాగిస్తున్నాం అంటూ1971 నాటి పొత్తును గుర్తు చేశారు.

ఇలాంటిదే మరో ఘటన ఎమర్జెన్సీ టైమ్ లో డిఎంకే కార్యకర్తలందరూ జైలు పాలయ్యారు ఆ నేపధ్యంలో వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం కింద పార్టీ ఆఫీస్ నుంచి కుటుంబానికి 200రూపాయల చొప్పున కరుణానిధి పంపించారు. వెట్రికొండన్ అనే కార్యకర్త ఆవేశంతో తన భార్యకు వంద రూపాయలు మాత్రమే అందాయంటూ కంప్లయింట్ చేశాడు. దీనికి కరుణానిధి స్పందిస్తూ మరో వంద నీ రెండో భార్యకు పంపాను అని కౌంటర్ ఇచ్చారు. 2003లో విల్లుపురంలో పార్టీ సదస్సులో ఈ సంఘటన తలుచుకుంటూ నాకూ ఇద్దరు భార్యలున్నారు ఆ బాధ నాకు తెలుసు అని జోక్ చేశారు.

1998లో అన్నా డిఎంకే, బిజెపి పొత్తుపై కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఏ పార్టీ అంటరానిది కాదు అని కామెంట్ చేశారు అయితే దీనిపై కరుణ తనదైన మార్క్ వేశారు అంటరానితనానికి, పడక పంచుకోడానికీ తేడా ఉందన్నారు ఆ మరుసటి ఏడాది డిఎంకే బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరింది. ఇలా ఎవరేం మాట్లాడినా కౌంటర్ ఇవ్వడానికి ముందుంటారు కరుణానిధి ఆయన మాటల కోసం తడుముకోరు స్క్రిప్ట్ రైటర్ కావడంతో మాట్లాడేటప్పుడే పంచ్ లు పడుతుంటాయి.

Next Story