బీజేపీని చిత్తు చేసిన కాంగ్రెస్

బీజేపీని చిత్తు చేసిన కాంగ్రెస్
x
Highlights

పంజాబ్‌లో కాంగ్రెస్ మరోసారి తన సత్తా చాటుకుంది. లూథియానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. శిరోమణి...

పంజాబ్‌లో కాంగ్రెస్ మరోసారి తన సత్తా చాటుకుంది. లూథియానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. శిరోమణి అకాలీదళ్‌-బీజేపీ కూటమి రెండో స్థానంలో సరిపెట్టుకుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కు మరోసారి భంగపాటు ఎదురైంది. లుథియానాలో 95 వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలను మంగళవారం ప్రకటించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ తొమ్మిది కేంద్రాల్లో కౌంటింగ్‌ నిర్వహించారు. కాంగ్రెస్‌ 61 వార్డుల్లో ఘన విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అకాలీదళ్ 11, బీజేపీ 10 స్థానాలు దక్కించుకున్నాయి. లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ 7 చోట్ల గెలిచింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక స్థానానికే పరిమితమైంది. స్వతంత్రులు నాలుగు స్థానాల్లో పాగా వేశారు.

అతిపెద్ద మున్సిపాలిటీగా చెప్పుకునే లూథియానాలో ఎలాగైనా పాగా వేయాలని ప్రధాన పార్టీలు గట్టి ప్రయత్నాలే చేశాయి. అమృత్‌సర్, పాటియాలా, జలంధర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన రెండు నెలలు తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అమృత్ సర్, పాటియాలా, జలంధర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం లూథియానా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా 108 టేబుల్స్‌తో తొమ్మిది కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం పది గంటలకే కాంగ్రెస్ ఆధిక్యతలోకి రాగా, 11 గంటల సమయానికి కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత సాగించింది. గత శనివారంనాడు లూథియానా సివిక్ పోల్స్ జరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories