ప్రేమ పెళ్లితో క‌ష్టాలు ప్రారంభం

x
Highlights

వారిద్దరూ మేజర్లు...ఒకరిపై ఒకరు మనసుపడ్డారు...8ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ప్రైవేట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి...

వారిద్దరూ మేజర్లు...ఒకరిపై ఒకరు మనసుపడ్డారు...8ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ప్రైవేట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి రెండు కుటుంబాలు విలన్లుగా మారాయ్. దీంతో చేసేదేమీ లేక ప్రేమికులిద్దరూ నిన్న రామంతాపూర్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

పఠాన్‌చెరుకు చెందిన కె భానుప్రకాశ్‌, మియాపూర్‌కు చెందిన స్వప్నబాయిలో ప్రైవేట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించినా పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించలేదు. ప్రేమ వ్యవహారం బయట పడినప్పటి నుంచి అమ్మాయి కష్టాలు మొదలయ్యాయ్. రెండు నెలలుగా స్వప్పబాయి బయటకు వెళ్లకుండా కుటుంబసభ్యులు బంధించారు. భానుప్రకాశ్‌ను పెళ్లి చేసుకుంటే చంపేస్తామంటూ స్వప్నబాయిని బెదిరించారు.

భానుప్రకాశ్‌, అతని స్నేహితులపై స్వప్నబాయి బంధువులు కిడ్నాప్‌ కేసు పెట్టారు. అయితే స్వప్నబాయి తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని ఇష్టపూర్వకంగానే భానుప్రకాశ్‌తో వచ్చానని తెలిపింది. అమ్మాయి బాబాయి పోలీస్‌ అధికారి కావడంతో ప్రేమికులు ప్రాణ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భానుప్రకాశ్‌, స్వప్నబాయిలు కుల నిర్మూలన సంఘం నేతలను పరామర్శించారు. ఇరు కుటుంబాల నుంచి రక్షణ కల్పించాలని ప్రేమికులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories