ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో బీటెక్ యువతికి పరిచయం.. చివరికి..

ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో బీటెక్ యువతికి పరిచయం.. చివరికి..
x
Highlights

గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ హోటల్‌లో ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు...

గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ హోటల్‌లో ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. కృష్ణా జిల్లా టైలర్‌పేటకు చెందిన ఆటోడ్రైవర్ దారా ఫృద్వీరాజుకు వివాహమై భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని కొత్తూరులంక సాయిదివ్యతో ఐదు మాసాల క్రితం పరిచయం ఏర్పడింది. ఏలూరు నుండి ప్రతి రోజూ సాయిదివ్య విజయవాడకు గ్రూప్-2 కోచింగ్‌కు వస్తూండేది. దీంతో బస్టాండ్‌లో ఫృద్వీరాజ్‌తో సాయిదివ్యతో పరిచయం ఏర్పడింది. ఈ నెల 9వ తేదీ నుండి సాయిదివ్వ కన్పించకుండా పోయింది. దీంతో సాయిదివ్య అదృశ్యమైందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 9వ తేదీన సాయిదివ్య కనబడటం లేదని కుటుంబ సభ్యులు ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆటోడ్రైవర్‌ ఫృద్వీరాజు సాయిదివ్యను వెంట పెట్టుకుని పట్టణ గాంధీచౌక్‌లోని ప్రిన్స్‌ హోటల్‌ 405లో జాబ్‌ పర్పస్‌ అని చెప్పి దిగారు. దిగిన నాటి నుంచి ఇంత వరకు తలుపు తీయలేదని, సోమవారం మధ్యాహ్నం గది నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా కిటికి తలుపు తెరిచి చూడగా ఇద్దరు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories