ప్రేమికుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నం!

chaitanya
Updated on: 24 Dec 2018 1:27 PM IST
ప్రేమికుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నం!
X

ప్రేమికుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. నగరంలోని లేబర్‌ కాలనీకి చెందిన మౌనిక తో , కీర్తి నగర్ కు చెందిన సమీర్ కు మూడేళ్ళ కిందట పరిచయంఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మౌనికతో సమీర్ మాట్లాడటం మానేశాడు. తనతో ఎందుకు మాట్లాడటం లేదని మౌనిక సమీర్ ను ప్రశ్నించింది. కానీ సమీర్ నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో మనస్థాపానికి గురైన మౌనిక బ్లేడ్ తో తన చేతిని కోసుకుంది. భారీగా రక్తం పోవడం చూసి ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు ప్రధమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిపై ఆరాతీశారు.

chaitanya

chaitanya

Next Story