ప్రణయ్‌ హత్య తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్న ప్రేమజంటలు

x
Highlights

తీవ్ర సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణ‍య్‌ హత్యతో ప్రేమజంటలు భయాందోళనలకు గురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను...

తీవ్ర సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణ‍య్‌ హత్యతో ప్రేమజంటలు భయాందోళనలకు గురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకొచ్చారు. ప్రణయ్ మర్డర్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రేమజంటలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రణయ్‌ హత్య తర్వాత ఆందోళనకు గురైన ఓ ప్రేమజంట మీడియా ముందుకొచ్చింది. కులాంతర వివాహం చేసుకున్నందుకు మూడు నెలలుగా తమ బంధువులు బెదిరిస్తున్నారంటూ నవ దంపతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కడప జిల్లాకు చెందిన దీప్తిరెడ్డి, విజయ్‌లు ఈ ఏడాది జులైలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే దీప్తిరెడ్డి కుటుంబ సభ్యులు పోలీసు శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగులు కావడంతో పోలీసుల ద్వారా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయ్‌ను చంపేస్తామని తన కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని దీప్తిరెడ్డి అంటోంది. ప్రణయ్ మర్డర్‌ తర్వాత పలువురు ప్రేమజంటలు కులాంతర, మతాంతర వివాహలు చేసుకున్న నవ దంపతులు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణయ్‌ హత్య నేపథ్యంలో పోలీసులు కూడా ముందుజాగ్రత్తలు తీసుకుంటూ, పేరెంట్స్‌కు కౌన్సెలింగ్‌ ఇవ్వడం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories