logo
జాతీయం

అవిశ్వాసం; మళ్లీ అడ్డుపడ్డ అన్నాడీఎంకే.. వాయిదా

అవిశ్వాసం; మళ్లీ అడ్డుపడ్డ అన్నాడీఎంకే.. వాయిదా
X
Highlights

అవిశ్వాస తీర్మానం ఏడో రోజూ లోక్‌సభలో చర్చకు నోచుకోలేదు. ఆరు రోజులుగా జరుగుతున్న తతంగమే ఇవాళ కూడా సాగింది....

అవిశ్వాస తీర్మానం ఏడో రోజూ లోక్‌సభలో చర్చకు నోచుకోలేదు. ఆరు రోజులుగా జరుగుతున్న తతంగమే ఇవాళ కూడా సాగింది. తొలుత అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనల కారణంగా సభ గంట పాటు వాయిదా పడింది. సభ మళ్ళీ సమావేశమైన తర్వాత కూడా సేమ్ సీన్ రిపీటైంది. కావేరి నదీజలాల బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడిఎంకే ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.

కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు అందాయని ఆ గందరగోళం మధ్యే స్పీకర్ ప్రకటించారు. సభ సజావుగా ఉంటే అవిశ్వాసంపై చర్చ చేపడదామని అన్నారు. అవిశ్వాసాన్ని వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్స నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అటు అవిశ్వాసంపై చర్చ జరపాలని అన్ని విపక్షాలు పట్టు పట్టాయి. అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో అవిశ్వాసానికి మద్దతిచ్చే ఎంపీల సంఖ్య లెక్కించడం కష్టమని స్పీకర్ అన్నారు. సభ ఆర్డర్ లేదంటూ సుమిత్రా మహాజన్ రేపటికి వాయిదా వేశారు. దీంతో ఏడో రోజు కూడా అవిశ్వాస తీర్మానం ముందుకు సాగలేదు.

Next Story