అత్తారింటికి విచ్చేసిన అల్లు అర్జున్

nanireddy
Updated on: 24 Dec 2018 3:31 PM IST
అత్తారింటికి విచ్చేసిన అల్లు అర్జున్
X

ఎప్పుడు సినీ సెట్టింగులు, సెలబ్రిటీల మధ్య గడిపే అల్లుఅర్జున్ పండగ సందర్బంగా రొటీన్ కు బిన్నంగా గడిపారు. దసరా వేడుకకు హైదరాబాద్ నుంచి తన అత్తారింటికి తరలివెళ్లారు ఈ స్టైలిష్ స్టార్. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి అత్తగారిళ్లయిన నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామానికి వెళ్లారు. బన్నీ రాక సందర్బంగా పెద్ద ఎత్తున అభిమానులు, ఊరి జనాలు అక్కడికి వచ్చి ఆయనతో సెల్ఫీలు దిగడానికి క్యూ కట్టారు. అందరిని కలుపుకుని పోయే బన్నీ.. అత్తారింటి చుట్టుపక్కన ఉండే జనాలతో మమేకమయ్యారు. ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. కాగా.. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున ఇబ్రహీంపట్నం నియోజకవర్గంనుంచి పోటీ చేశారు.

nanireddy

nanireddy

Next Story