కరుణానిధి శవపేటిక మీద ఏం రాశారు?

కరుణానిధి శవపేటిక మీద ఏం రాశారు?
x
Highlights

కరుణానిధిని ఉంచే శవపేటిక మీద తమిళంలో రాసి ఉన్న మాటలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. బంగారంతో పోత పోసిన శవపేటిక మీద ఇలా రాసి ఉంది....

కరుణానిధిని ఉంచే శవపేటిక మీద తమిళంలో రాసి ఉన్న మాటలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. బంగారంతో పోత పోసిన శవపేటిక మీద ఇలా రాసి ఉంది. ‘విరామమన్నది ఎరుగక, నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు’.. ఈ మాటలు కరుణానిధికి వర్తించినంత బాగా ఇంక ఎవరికి వర్తించవేమో. అందుకే శాశ్వత నిద్రలోకి జారుకుని విశ్రమిస్తోన్న ‘కలైజ్ఞర్‌’ శవపేటిక మీద ఈ మాటలనే చెక్కించారు. ఒకానొక సందర్భంలో కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌తో ‘మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి అన్నది ఎరగకుండా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్నారని’ అనుకోవాలని చెప్పారట. ఈ మాటలు కరుణానిధికి సరిగ్గా సరిపోతాయి. అందుకే ఆయన శవ పేటికి మీద కొడుకు స్టాలిన్‌తో చెప్పిన మాటలనే తమిళంలో చెక్కించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories