రక్షణ శాఖ భూముల వ్యవహారం

Highlights

రక్షణ శాఖ పరిదిలోని భూముల వ్యవహారంపై, ప్రధానికి ఒక వినతిపత్రం అందించారు ఎంపీలు, తెలంగాణా రాష్ట సర్వతోముఖ అబివ్రుదికై, వీటి నిర్మాణం చాల ముఖ్యం...

రక్షణ శాఖ పరిదిలోని భూముల వ్యవహారంపై,

ప్రధానికి ఒక వినతిపత్రం అందించారు ఎంపీలు,

తెలంగాణా రాష్ట సర్వతోముఖ అబివ్రుదికై,

వీటి నిర్మాణం చాల ముఖ్యం అని విన్నపాలు,

ఈ భూములు ఎవరిపాలు అవుతాయో మరి. శ్రీ.కో

మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో టిఆర్‌ఎస్‌కు చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ భూముల వ్యవహారంపై ప్రధానికి వినతిపత్రం అందించారు. మల్కాజ్‌గిరిలోని రక్షణ శాఖ భూమిని తమకు అప్పగిస్తే అక్కడ ఫ్లైఓవర్‌ నిర్మాణం జరుపుతామని దాని ద్వారా 44వ నంబర్‌ జాతీయ రహదారి రాష్ట్ర రహదారి అనుసంధానానికి అనువుగా ఉంటుందని ఎంపీలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం భవనాలకు బైసన్‌పోల్‌, జింఖానా మైదానాల్లో ఏదోకటి కేటాయించాలని వారు ప్రధానిని కోరినట్లు వార్తాలు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories