మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా ఉమ

మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా ఉమ
x
Highlights

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మరోసారి భూ వివాదంలో ఇరుక్కున్నారు!. ఇప్పటికే బోండా పేరు వివాదాలతో పలుమార్లు వార్తల్లో నిలిచింది. తాజాగా మరో భూ...

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మరోసారి భూ వివాదంలో ఇరుక్కున్నారు!. ఇప్పటికే బోండా పేరు వివాదాలతో పలుమార్లు వార్తల్లో నిలిచింది. తాజాగా మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. సబ్బరాయనగర్‌ వెంచర్‌లో స్థలం ఇస్తామని రూ. 35 లక్షలు వసూలు చేసినట్టు నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో తనతో మాట్లాడి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తనతో చెప్పారని బాధితులు చెబుతున్నారు. కానీ ఇపుడు స్థలం లేదు, సొమ్ము లేదంటూ మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేతో సహా నలుగురిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు నగర సీపీకి ఫిర్యాదు చేశాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories