కారులేని ప్రధాని ఎవరో తెలుసా మీకు?

కారులేని ప్రధాని ఎవరో తెలుసా మీకు?
x
Highlights

వేల కోట్ల రుణాలు ఎగనామం పెట్టిన నీరవ్ మోడీ విదేశాల్లో విందులు ఆరగిస్తూ జల్సా చేస్తున్నాడు. ఆయన తరఫు వకీళ్లు, అనుచర వర్గం మాత్రం ఇందులో నీరవ్ మోడీ...

వేల కోట్ల రుణాలు ఎగనామం పెట్టిన నీరవ్ మోడీ విదేశాల్లో విందులు ఆరగిస్తూ జల్సా చేస్తున్నాడు. ఆయన తరఫు వకీళ్లు, అనుచర వర్గం మాత్రం ఇందులో నీరవ్ మోడీ నిర్దోషి అని, టూజీ కేసులో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుందని బుకాయిస్తున్నారు. కానీ మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇదే పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఓ చిన్న అవసరం కోసం చాలా చిన్న మొత్తం లోన్ తీసుకున్నారు. మరి శాస్త్తి చెల్లించారా చిన్న మొత్తమే కదా అని లైట్ తీసుకున్నారా? ఈ స్టోరీలో చూడండి.

విలక్షణమైన ప్రధానిగా, నికార్సయిన జాతీయ నేతగా ఇప్పటికీ భారతీయులంతా గర్వంగా చెప్పుకుంటారు లాల్ బహదూర్ శాస్త్రి గురించి. వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టాలు, మరెన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఆ ముద్రను మాత్రం తుదకంటా కాపాడుకున్నారు శాస్త్రి.

అప్పటి జాతీయ నేతల్లో జవహర్లాల్ నెహ్రూ కుటుంబం చాలా రిచ్. నెహ్రూ చిన్నప్పుడు స్కూలు నుంచి తిరిగొచ్చేటప్పుడు ఏ ద్వారం గుండా బయటికొస్తాడో తెలీదు కాబట్టి అన్ని ద్వారాల ముందూ ఒక్కో కారుండేలా మోతీలాల్ నెహ్రూ పురమాయించేవాడని చెబుతారు. ఇక నెహ్రూ తరువాత ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రిది దిగువ మధ్యతరగతి కుటుంబమే. ఆయన ప్రధాని అయిన చాలా రోజుల వరకు సొంత కారు కూడా లేదట.

ప్రధాని హోదాలో ప్రభుత్వం ఇచ్చిన కారును శాస్త్రి కుటుంబ అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం వాడేవారు కాదు. శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి చిన్నతనంలో తమకూ ఓ కారుండాలని మారాం చేసేవాడట. భార్య లలిత కూడా ఓ చిన్నపాటి కారు తీసుకోండి అంటూ అడిగేదట. దీంతో లాల్ బహదూర్ శాస్త్రి ఓ కారు తీసుకుందామని డిసైడైపోయారు. తన ఖాతా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉన్న మొత్తం 7 వేలు మాత్రమే. కారు ధరేమో 12 వేల రూపాయలుంది. దీంతో శాస్త్రి 5 వేలకు లోన్ అప్లయి చేసుకున్నారు. వెంటనే బ్యాంకు ఆ 5 వేల రుణాన్ని మంజూరు చేసింది. అలా శాస్త్రి ఓ కారుకు ఓనరయ్యారు. ఇది 1964 నాటి సంగతి.

ఇక 1966లో శాస్త్రి రష్యాకు వెళ్లినప్పుడు అనుమానాస్పదంగా మరణించారు. అయితే శాస్త్రి పేరున ఏమేం లావాదేవీలు జరిగాయో.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వీఎస్ వెంకటరామన్ ఎంక్వైరీ చేయడంతో పి.ఎన్.బి. లో ఉన్న 5 వేల రూపాయల లోన్ సంగతి బయటపడింది. దీంతో శాస్త్రి భార్య లలిత తనకు వచ్చే పెన్షన్ డబ్బు లోంచి 5 వేల రూపాయల రుణాన్ని తీర్చేశారు. ఈ విషయాన్ని శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి ఇప్పుడు గుర్తు చేసుకోవడం వార్తంశంగా మారింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి అక్రమంగా 11,400 కోట్ల రుణాలు తీసుకొని విదేశాల్లో జల్సాలు చేస్తున్న నీరవ్ మోడీలు... సిగ్గు లేకుండా బుకాయిస్తుండగా.. నిజాయతీకి కట్టుబడ్డ ఆనాటి నేతల్ని చూసి బుద్ధి నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు సామాన్య ప్రజలు.

Former Prime Minister Lal Bahadur Shastri (Source: Facebook)

Show Full Article
Print Article
Next Story
More Stories