ప్రజలను కన్ఫ్యూజ్‌ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు : జీ వివేక్

nanireddy
Updated on: 24 Dec 2018 4:30 PM IST
ప్రజలను కన్ఫ్యూజ్‌ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు : జీ వివేక్
X

తెలంగాణ ప్రజానికం మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పట్టం కడతారని.. అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ, టీఆరెస్ సినీయర్ నేత జీ వివేక్. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున టికెట్ కోసమే లగడపాటి సర్వేను తారుమారు చేసారని ఆరోపించారు. విజయవాడ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ కోసమే కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను ఇస్తున్నారని.. సర్వేలతో ప్రజలను కన్ఫ్యూజ్‌ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని వివేక్ అన్నారు.

nanireddy

nanireddy

Next Story