రేపు మరో ఇద్దరి పేర్లు ప్రకటన..!

nanireddy
Updated on: 24 Dec 2018 4:20 PM IST
రేపు మరో ఇద్దరి పేర్లు ప్రకటన..!
X

ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించారు. సర్వే కోసం ఇప్పటికే తన టీమ్ ను రంగంలోకి దింపిన లగడపాటి డిసెంబర్ 7న రాత్రి 7 గంటలకు సర్వే ఫలితాలు వెల్లడిస్తానని చెప్పారు. అయితే అడ్వాన్స్ గా ఇద్దరు ఇండిపెండెంట్లు గెలవబోతున్నారంటూ పేర్లు చెప్పి మరి టెన్షన్ రాజేసాడు. ఈసారి 8 నుంచి 10 మంది స్వతంత్రులు విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. రోజుకు 2 పేర్లు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు చెప్తానన్న లగడపాటి.. రెండు నియోజకవర్గాల్లో తన అంచనాను వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో ఇండిపెండెంట్ శివకుమార్‌రెడ్డి గెలుస్తారన్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఇండిపెండెంట్‌ జాదవ్ అనిల్‌ కుమార్ గెలుస్తారని తమ సర్వేల్లో తేలిందంటున్నారు. ఇక రేపు మరో ఇద్దరి పేర్లను ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. దాంతో లగడపాటి ఎవరి పేర్లను ప్రకటిస్తారోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

nanireddy

nanireddy

Next Story