మరో ముగ్గురి పేర్లను వెల్లడించిన లగడపాటి

nanireddy
Updated on: 24 Dec 2018 4:24 PM IST
మరో ముగ్గురి పేర్లను వెల్లడించిన లగడపాటి
X

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి.. తెలంగాణలో కూడా సర్వే చేయించారు. ఈ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పిన ఆయన గతవారం ఇద్దరి పేర్లను ప్రకటించారు. తాజాగా మరో ముగ్గురి పేర్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. అయితే మరో మూడు నియోజకవర్గాల్లో తన స్నేహితులు పోటీ చేస్తున్నారని.. దాంతో ఆ మూడు స్థానాలు చెప్పానని అన్నారు. తన సర్వే ఎవరికీ అనుకూలం కాదని ప్రజల నాడిని తెలుసుకోవడమే తన పని అన్నారు లగడపాటి.

nanireddy

nanireddy

Next Story