లంచం తీసుకుంటూ దొరికిన లేడీ పోలీస్ ఆఫీసర్

లంచం తీసుకుంటూ దొరికిన లేడీ పోలీస్ ఆఫీసర్
x
Highlights

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిపోయింది ఓ లేడీ పోలీస్ ఆఫీసర్. లంచం తీసుకుంటూ మహోస్మిత పండా అనే ఒడిశాకు చెందిన మహిళా పోలీసు అధికారిణి విజిలెన్స్...

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిపోయింది ఓ లేడీ పోలీస్ ఆఫీసర్. లంచం తీసుకుంటూ మహోస్మిత పండా అనే ఒడిశాకు చెందిన మహిళా పోలీసు అధికారిణి విజిలెన్స్ అధికారులకు చిక్కింది. బాధితుడి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను కటక్ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసులో బాధితుడు సుబేందు దాస్ బెయిల్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్‌టీపీసీ పోలీస్ స్టేషన్‌లో మహోస్మిత పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్‌గా పనిచేస్తున్నది. బెయిల్ కోసం క్లియరెన్స్ ఇవ్వాలంటూ సుబేందు పోలీసు ఆఫీసర్‌ను ఆశ్రయించాడు. అయితే ఆ ఆఫీసర్ బాధితుడి నుంచి డబ్బు డిమాండ్ చేసింది. దీంతో ఈ విషయాన్ని అతను విజిలెన్స్ అధికారులకు తెలియజేశాడు. ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం కెమికల్ కోటెడ్ కరెన్సీ నోట్లను పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధితుడు ఆ ఆఫీసర్‌కు అందజేశాడు. ఆ సమయంలోనే విజిలెన్స్ అధికారులు ఆమెను పట్టుకున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద లేడీ పోలీసు ఆఫీసర్‌పై చర్యలు తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories