ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు: బుట్టా రేణుక

ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు: బుట్టా రేణుక
x
Highlights

ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామని గతంలో కేంద్రమే చెప్పిందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. అదే హామీని ఇప్పుడు అమలు చేయాలని కోరుతున్నామని, రాష్ట్ర...

ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామని గతంలో కేంద్రమే చెప్పిందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. అదే హామీని ఇప్పుడు అమలు చేయాలని కోరుతున్నామని, రాష్ట్ర హక్కుల సాధన విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని ఆమె స్పష్టం చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందనే ఆశతో గత నాలుగేళ్లుగా ఎదురు చూశామని కానీ, ఏమీ రాలేదని అన్నారు. అన్నీ ఇస్తామని కేంద్ర ఆర్థకమంత్రి జైట్లీ ప్రకటన చేశారని ఆ తర్వాత మొండి చేయి చూపించారని మండిపడ్డారు. చివరి బడ్జెట్ లో కూడా ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రత్యేక ప్రకటన రాకపోవడంతో ఆందోళన చేస్తున్నామని చెప్పారు. హోదా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చివరకు హోదా, ప్యాకేజీ రెండూ లేకుండా పోయాయని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories