కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ
Highlights
వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచారు. సార్వత్రిక ఎన్నికలకు సై అంటూ కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు...
arun11 Jan 2018 7:51 AM GMT
వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచారు. సార్వత్రిక ఎన్నికలకు సై అంటూ కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేశారు. జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హఫీజ్‌ఖాన్‌ను ఖరారు చేస్తున్నట్లు ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మేకపాటి గౌతంరెడ్డి బుధవారం ప్రకటించారు. నగరంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీ మేరకు తమ నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో నియోజకవర్గంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలని వైఎస్ జగన్ సూచించినట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల పార్లమెంటు జిల్లాల అధ్యక్షులతో పాటు నాయకులు, కార్యకర్తలు హఫీజ్‌ఖాన్ గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు.
లైవ్ టీవి
పల్లె ప్రగతికి సమాయత్తం కావాలి : మంత్రి పి. సబితారెడ్డి
8 Dec 2019 12:38 PM GMTదిశ తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్న NHRC బృందం
8 Dec 2019 12:24 PM GMTపీటలదాకా వచ్చిన పెళ్లి అంతలోనే ఆగిపోయింది.. కారణం ఏంటంటే..
8 Dec 2019 12:19 PM GMTవిజయవాడ భవానీ కథ సుఖాంతం
8 Dec 2019 12:18 PM GMTపార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే స్పందన
8 Dec 2019 11:59 AM GMT