సమ్మర్‌ హీట్‌కు పాట్‌ ఐడియా..థండా..థండా... కుండ కూలర్‌

x
Highlights

అతని ఆలోచన అదిరింది. ఏదో ఒక ప్రయోగం చేసి పదిమందికి ఉపయోగ పడే వస్తువు తయారు చేయాలనే చిన్ననాటి ఆలోచనకు రూపాన్నిచ్చాడు. అందరికీ అందుబాటులో ఉండేలా...

అతని ఆలోచన అదిరింది. ఏదో ఒక ప్రయోగం చేసి పదిమందికి ఉపయోగ పడే వస్తువు తయారు చేయాలనే చిన్ననాటి ఆలోచనకు రూపాన్నిచ్చాడు. అందరికీ అందుబాటులో ఉండేలా పర్యావరణానికి హాని చేయని ఓ అద్భుత ఎయిర్ కూలర్ తయారు చేశాడు షెట్‌పల్లి గ్రామానికి చెందిన జోగు ప్రమోద్.

నిజామాబాద్ జిల్లా మొర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామానికి చెందిన జోగు ప్రమోద్ పదవ తరగతి చదివి బొంబాయిలో ఏసీ మెకానిజం నేర్చుకొని గల్ఫ్ వెళ్ళాడు. అక్కడ కొన్నేళ్లు పనిచేసి సొంతూరిలోనే స్థిరపడ్డాడు. ప్రమోద్‌కు చిన్నప్పటి నుంచి మట్టి కుండతో ఏదో ఒకటి తయారు చేయాలని కోరిక. ఎండా కాలం వచ్చిదంటే ఆరోగ్యానికి మంచిదని మట్టి రంజన్‌లోని నీళ్ళు తాగుతాం.. కుండ నుంచి చల్లని గాలి వస్తే ఇంకా ఆరోగ్యం కదా అన్న ఆలోచనతో రంజన్ కూలర్ తయారీకి శ్రీకారం చుట్టాడు.

ప్రకృతిసిద్ధంగా నీటిని చల్లబరిచే మట్టి కుండను, నీటిని వాడుతూ కూలర్ తయారు చేశాడు. మామూలు ఎయిర్ కూలర్‌‌కి ఉన్న అన్ని హంగులు ఉన్నప్పటికీ ఒక రంజన్‌లోనే యంత్రాలన్నీ అమర్చి ఉండటం ఈ కూలర్ ప్రత్యేకత. మండుటెండలో మిట్టమధ్యాహ్నం కూడా ఈ కుండ వేగంగా గాలిని చల్లబరుస్తోంది. ఈ మట్టి కుండ కూలర్‌ను చిన్న గదిలో ఓ మూల పెట్టేసుకోవచ్చు. ముఖ్యంగా దుకాణం దారులు తమ టేబుల్‌పై ఓ పక్క అమర్చుకోవచ్చు,

సౌండ్ పొల్యూషన్ ఉండదు. విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటోంది. మంచి ఆక్సిజన్ గాలి నిస్తుంది. మిగతా కూలర్‌ల మాదిరిగా ఏటా రిపేర్లు అవసరం లేదు. కరంట్ షాక్ ప్రమాదమే ఉండదు. ఇన్ని సదుపాయాలున్న మట్టి కూలర్‌ను చుట్టుపక్కల గ్రామాల్లో సూపర్ హిట్టయింది. దీని ఖరీదు 1400 కావడంతో అంతా తెగ కొనేస్తున్నారు. ఈ మట్టి కుండ కూలర్ వాడిన ప్రతి ఒక్కరు అన్ని విధాలుగా బాగుందని.. పనితనం అద్భుతమని ప్రమోద్‌ని అభినందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories