ఇవాంక విషయంలో బద్నాం చేశారు : కేటీఆర్

x
Highlights

అమెరికన్ బ్యూటీ అగ్రరాజ్యాధిపతి కుమార్తె.. ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ టూర్ కి వచ్చి నెల్లాళ్లయిపోయినా ఇంకా ఈరోజుకీ ఆమె వార్తల్లో వ్యక్తే అవుతోంది?....

అమెరికన్ బ్యూటీ అగ్రరాజ్యాధిపతి కుమార్తె.. ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ టూర్ కి వచ్చి నెల్లాళ్లయిపోయినా ఇంకా ఈరోజుకీ ఆమె వార్తల్లో వ్యక్తే అవుతోంది?. ఇప్పటికీ శ్వేత సౌధాధిపతి కుమార్తె పేరే స్మరించుకునే అవసరం ఎందుకొచ్చింది? నెల్లాళ్లు దాటినా ఇంకా ఇవాంకానేనా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా నగరానికి వచ్చి వెళ్లి నెల్లాళ్లవుతోంది. అయినా ఇంకా ఇవాంకా ఫీల్ భాగ్యనగరాన్ని వదలడం లేదు.. అప్పట్లో ప్రపంచ భాగస్వామ్య సదస్సుకు ఈ ట్రెండీ లేడీ రాక సందర్భంగా రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేశారు క్షణాల్లో కోట్లు గుమ్మరించి హైటెక్ సిటీ పరిసర ప్రాంతం రోడ్లన్నీ అద్దంలా మెరిపించారు. అందరూ చూస్తుండగానే మేడమ్ ఇవాంకా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ఓ తారలా తళుక్కుమని అమెరికా పయనమయ్యారు ఇవాంకా కలియ తిరిగిన ప్రాంతాల్లో రోడ్లన్నీ ఈ దెబ్బకు బాగుపడిపోయాయి.

ఇవాంకా రాకపై సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్లో జోకులు కూడా పేలాయి నగర రోడ్లకు మోక్షం రావాలంటే ఓ ఇవాంకా రావాలి ఇవాంకా మా వీధికి రా మా కాలనీకి రా అంటూ ఆమె పై సరదా సరదా ట్వీట్లు కూడా బానే చక్కర్లు కొట్టాయి అమెరికా అధ్యక్షుడి కుమార్తె రాక సందర్భంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి హడావుడిగా రోడ్ల రిపేర్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత రోడ్ల విస్తరణ, అభివృద్ధి సంగతి గాలికొదిలేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి ఏ హోదా లేని ఓ అగ్రరాజ్యాధిపతి కుమార్తె పర్యటనకు కోట్లు కుమ్మరించారు నగర ప్రజలను పట్టించుకోరా అన్న విమర్శలూ పెరిగిపోతున్నాయి.

ఇవాంకా ఇవాంకా ఈ పేరుతో హైదరాబాద్ రోడ్లపై జరిగిన రచ్చ, చర్చ అంతా ఇంతా కాదు అయితే ఈ విమర్శలకు ఐటి మంత్రి కేటిఆర్ కౌంటర్ ఇచ్చారు. నగరంలోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, ఇవాంకా రాకకన్నా ముందే తమ పని మొదలైందనీ కేటిఆర్ అన్నారు నగరంలో రోడ్ల సుందరీకరణ అంతకుముందే మొదలైందన్నారు. నగరంలో 23 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మరో మూడువేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామనీ అన్నారు మాదాపూర్ సమీపంలో అయ్యప్ప సొసైటీ దగ్గర నిర్మించిన అండర్ పాస్ ప్రారంభోత్సవం సందర్భంగా కేటిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద మేడమ్ ఇవాంకా టూర్ జరిగి నెల్లాళ్లయినా ఇంకా వార్తల్లో వ్యక్తిగా నిలవడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories