ఆంధ్ర యువకుడి పనికి కేటీఆర్‌ ఫిదా

ఆంధ్ర యువకుడి పనికి కేటీఆర్‌ ఫిదా
x
Highlights

టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారం చేపట్టాలని,...

టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారం చేపట్టాలని, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని తాజాగా కేసీఆర్‌పై అభిమానంతో ఓ యువకుడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. నెలూరు జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి కేటీఆర్ వీరాభిమాని. తన గుండెపై కేటీఆర్ రూపాన్ని టాటూగా వేయించుకున్నాడు. గులాబీ దుస్తుల్లో విజయవాడ నుంచి కాలినడకన హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే ఆ యువకుడు చేసిన పనికి మంత్రి కేటీఆర్‌ ఫిదా అయ్యారు. ట్వీటర్‌ వేదికగా అతనికి ధన్యవాదాలు తెలిపారు. ‘రోహిత్‌ రెడ్డి నీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. ఏపీకి చెందిన రోహిత్‌.. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌కు మద్దతుగా విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories