సర్వే ట్విస్ట్ : లగడపాటి చేసిన మెసేజ్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన కేటీఆర్‌

nanireddy
Updated on: 24 Dec 2018 4:24 PM IST
సర్వే ట్విస్ట్ : లగడపాటి చేసిన మెసేజ్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన కేటీఆర్‌
X

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడితోనే లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే ఫలితాలను మార్చారని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీకి 65–70 సీట్లు వస్తాయంటూ గత నెల 20న లగడపాటి రాజగోపాల్ తనకు పంపిన మెసేజ్‌ను ఆయన మంగళవారం ట్విట్టర్‌లో పెట్టారు.. లగడపాటి చేత సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే తాను ఆ మెసేజ్‌ను షేర్‌ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

ఆ మెసెజ్ లో నవంబర్‌ 20 నాటికి ఉన్న పరిస్థితిని బట్టి టీఆర్‌ఎస్‌ పార్టీకి 65–70 వస్తాయని , కేసీఆర్‌ వ్యూహాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నదని లగడపాటి మెసెజ్ పెట్టారని కేటీఆర్ వెల్లడించారు.. తన సర్వేకు మించి టీఆర్‌ఎస్‌ పార్టీ సీట్లు సాధించినా ఆశ్చర్యం లేదని లగడపాటి అన్న విషయాన్నీ కేటీఆర్‌ వెల్లడించారు. లగడపాటిది సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే లాస్ట్‌ మినట్‌ ప్రయత్నమని వ్యాఖ్యానించారు.

nanireddy

nanireddy

Next Story