
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో కేటీఆర్ అంట్లు తోముకునేవాడన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో కేటీఆర్ అంట్లు తోముకునేవాడన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.‘ప్రియమైన ఉత్తమ్ కుమార్ గారూ.. నేను అమెరికాలోని నా ఇంట్లో అంట్లు తోమి ఉండవచ్చు(అమెరికాలోని చాలామంది భారతీయులు తమ ఇళ్లలో ఇదే చేస్తారు). నేను అమెరికాలో ఉద్యోగం చేస్తూ గౌరవప్రదంగా సంపాదించుకుంటూ బతికాను. దీని పట్ల నేను గర్వపడుతున్నా. అంతేకానీ మీ నాయకుడు పప్పూలాగా ప్రజా ధనాన్ని లూటీ చేయడమో, మీలాగా దోచుకున్న ప్రజల డబ్బును కారుతో సహా తగలబెట్టడమో చేయలేదు’ అని ట్విట్టర్ లో కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ కు రెండు పేపర్ కటింగ్ లను కూడా మంత్రి జతచేశారు.
Dear @UttamTPCC Garu, I may have washed dishes in my home in the US (which by the way is what every Indian in US does in their own homes)
— KTR (@KTRTRS) September 8, 2018
I am proud that I’ve worked & earned a decent living on my own unlike your Pappu
Unlike you I didn’t loot people’s money & burn it in my car pic.twitter.com/VXrMeESfCg

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire