కాంగ్రెస్ కు మరోనేత రాజీనామా.. జనసేనలో చేరుతున్నట్టు ప్రకటన

nanireddy
Updated on: 24 Dec 2018 3:27 PM IST
కాంగ్రెస్ కు మరోనేత రాజీనామా.. జనసేనలో చేరుతున్నట్టు ప్రకటన
X

నాదెండ్ల మనోహర్ బాటలోనే మరో నేత జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌ లో ఉన్న కృష్ణా జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు చలమలశెట్టి రమేష్‌ బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసినట్లు ప్రకటించారు. నిన్న(శుక్రవారం)ఈ విషయాన్నీ వెల్లడించారు. పవన్ వ్యవహార శైలి నచ్చి.. జనసేన విధానాలకు ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరబోతున్నట్లు రమేష్‌ బాబు తెలిపారు. తనతోపాటు కొత్తపల్లి పార్టీ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పల్నాటి చంటి, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామకృష్ణ, తదితరులు పార్టీకి రాజీనామా చేసినట్లు రమేష్‌ బాబు ప్రకటించారు. సోమవారం లేదా బుధవారం పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు అయన స్పష్టం చేశారు.

nanireddy

nanireddy

Next Story