తెలంగాణ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌

తెలంగాణ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌
x
Highlights

ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ స్పీకర్ కే.ఆర్ సురేష్ రెడ్డి పార్టీని వీడేందుకు...

ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ స్పీకర్ కే.ఆర్ సురేష్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని కేటీఆర్‌ నివాసంలో ఆయనతో సురేష్ రెడ్డి భేటి అయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు వివేక్‌తో పాటు జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 2004లో బాల్కొండ నుంచి గెలిచిన సురేష్‌రెడ్డి స్పీకర్‌గా వ్యవహారించారు. అనంతరం జరిగిన 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్‌లో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదంటూ గత కొద్ది కాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories