ఆయ‌నుంటేనే ఏపీ అభివృద్ధి - కోట‌

lakshman
Updated on: 24 Dec 2018 12:34 PM IST
ఆయ‌నుంటేనే ఏపీ అభివృద్ధి - కోట‌
X

ఏపీని న‌డిపించే సత్తా ఉన్ననాయ‌కుడు సీఎం చంద్ర‌బాబేన‌ని కోటా కితాబిచ్చారు. రాష్ట్ర‌విభ‌జ‌న‌లో భాగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ చేతిలో పెట్టార‌ని..ఏపీ అంటే ఆకులు ప‌ట్టుకుని విస్త‌రి త‌యారు చేసుకోవ‌డమే అన్నచందంగా మారింద‌న్నారు. అంతేకాదు హైద‌రాబాద్ లా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలా అవ్వాలంటే క‌నీసం 20సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని సూచించారు. అంతేకాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది చంద్ర‌బాబు వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని ,ముందస్తు ఆలోచన చేసే గొప్ప రాజకీయనాయకుడు, మంచి పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు. ఏపీ ఆయన చేతిలో ఉండటమే మంచిది. అంతకన్నా ఎవరూ చేయగలిగిందేమీ లేదు. ఆయన తప్పా ఇంకెవరు అభివృద్ధి చేయగలరు?’ అని చెప్పుకొచ్చారు.

lakshman

lakshman

Next Story