logo
సినిమా

ప‌వ‌న్ క‌ల్యాణ్ పాలిటిక్స్ పై కోటా కామెంట్స్

ప‌వ‌న్ క‌ల్యాణ్ పాలిటిక్స్ పై కోటా కామెంట్స్
X
Highlights

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ర‌జ‌నీ కాంత్ రాజ‌కీయంపై న‌టుడు కోటా శ్రీనివాస‌రావు స్పందించారు. ర‌జ‌నీకాంత్ ఆల‌స్యం...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ర‌జ‌నీ కాంత్ రాజ‌కీయంపై న‌టుడు కోటా శ్రీనివాస‌రావు స్పందించారు. ర‌జ‌నీకాంత్ ఆల‌స్యం చేయ‌కుండా పార్టీ ని స్థాపించి నిర్మాణం చేప‌ట్టాల‌ని సూచించారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అన్న చిరంజీవి విష‌యంలో ఎదురైన ఇబ్బందులు, స‌వాళ్ల‌ను అవ‌పోష‌ణ ప‌ట్టాల‌ని సూచించారు. రాజ‌కీయాల్లోకి ఎవ‌రైనా రావ‌చ్చు. స‌వాళ్లును ఎందుర్కోవ‌డ‌మే కావాల్సింద‌ని సూచించారు. అధికారంలో ఉన్నా లేక‌పోయినా బీజేపీకి, గౌర‌వం ఉన్నాయ‌ని కొనియాడారు. రాజధాని అమరావతిపై మాట్లాడుతూ బుడిబుడి అడుగులు వేస్తున్న నిర్మాణంలో ఉండ‌గానే ..ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని ప్ర‌భుత్వాన్ని నిందించ‌డం స‌రికాద‌న్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అయిందని అన్నారు. దేని గురించి విమర్శించాలన్నా కనీస సమయం పాటించాలని హితవు పలికారు.

Next Story