పార్టీ మార్పు వార్తలపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీలు

nanireddy
Updated on: 24 Dec 2018 4:03 PM IST
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీలు
X

తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్. తెలంగాణ భవన్‌లో సీతారాం నాయక్ మాట్లాడుతూ.. గతరెండు రోజులుగా టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు పార్టీ మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. అవి అవాస్తవం. టీఆర్ఎస్ లో తాను అసంతృప్తిగా ఉన్నానని.. కాంగ్రెస్ లోకి వస్తున్నాని కాంగ్రెస్ నేతలు చెప్పడం మైండ్‌గేమ్‌లో భాగమని వ్యాఖ్యానించారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఆ పార్టీ మరో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఖండించారు. రేవంత్‌ రెడ్డి కావాలనే తనపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు.

nanireddy

nanireddy

Next Story