కేసీఆర్ కు కొండా సురేఖ బహిరంగ లేఖ...

x
Highlights

టీఆర్ఎస్‌లో తాము హరీశ్‌రావు వర్గం అని కొండా సురేఖ దంపతులు తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌ పై తిరుగుబావుటా ఎగురవేసిన కొండా దంపతులు పార్టీ అధినేత కేసీఆర్‌కు...

టీఆర్ఎస్‌లో తాము హరీశ్‌రావు వర్గం అని కొండా సురేఖ దంపతులు తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌ పై తిరుగుబావుటా ఎగురవేసిన కొండా దంపతులు పార్టీ అధినేత కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనపై ఆమె డైరెక్ట్‌ అటాక్‌ చేసింది. తీవ్ర విమర్శలు చేసిన ఆమె వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించాలని తెలంగాణ ప్రజలను కోరింది. తాము హరీశ్‌రావు వర్గం అని చెప్పుకొచ్చిన ఆమె పార్టీలో ఆయన పరిస్థితి ఏంటో ఇటీవలే చూశారంటూ వ్యాఖ్యానించింది.

ఒక్క మహిళా మంత్రి లేకుండా పాలన సాగించిన ఏకైక సీఎం కేసీఆర్‌ అన్న కొండా సురేఖ ఇంతవరకు ఏ సమస్యను పరిష్కరించలేదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేని అసమర్థ పాలన సాగించారని ప్రతీ పనిలో కేటీఆర్ ఎంత పర్సంటేజీ తీసుకున్నారో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం హరికృష్ణ ఏం చేశారని స్థలం ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు రాకుండా ప్రజలకు కలవకుండా పాలించిన సీఎంగా కేసీఆర్‌ రికార్డ్‌ సృష్టించారని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories