టీడీపీతో పొత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

టీడీపీతో పొత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
x
Highlights

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి...

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తుపై మరోసారి ఆలోచించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. పొత్తుపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నిశితంగా వివరిస్తానని చెప్పారు. మహాకూటమిలోని పక్షాలను కేవలం పది సీట్లకు మాత్రమే పరిమితం చేయాలని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories