కోమ‌టిరెడ్డి విసిరిన మైక్..స్వామిగౌడ్ కు తీవ్ర‌గాయాలు

కోమ‌టిరెడ్డి విసిరిన మైక్..స్వామిగౌడ్ కు తీవ్ర‌గాయాలు
x
Highlights

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మూడుసార్లు మైక్, ఒకసారి హెడ్...

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మూడుసార్లు మైక్, ఒకసారి హెడ్ ఫోన్స్‌ను విసిరారు. మైక్ గాంధీ ఫోటోను తాకి స్వామి గౌడ్ కంటికి తగిలింది. దీంతో ఆయనను వెంటనే కంటి ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వంపై విపక్షాలు ఆందోళన చేయడం సహజమే అయినా దురుసుగా ప్రవర్తించడం, భౌతిక దాడులకు పూనుకోవడం సరికాదని తెలంగాణ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

గవర్నర్ బడ్జెట్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ పత్రాలు చించేయడం, అవి విసిరి నిరసన వ్యక్తం చేయడం తరుచూ చూస్తుంటాం. కానీ గవర్నర్‌పైకి వస్తువుల విసరడం హేయమని సభ్యులు అంటున్నారు. ఏదైనా అసహనం ఉంటే దానిని వ్యక్తం చేయాలి గానీ భౌతికదాడులు చేయడం సమంజసం కాదని సభ్యులు అంటున్నారు. అందరూ ఇలాంటి ఘటనలను ఖండించాల్సన అవసరం ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories