Top
logo

ఆ సీట్లు గెలవకపోతే...నేను గెలిచినా రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి

ఆ సీట్లు గెలవకపోతే...నేను గెలిచినా రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి
X
Highlights

నల్గొండలో జిల్లాలోని 12 స్థానాలకు 10 స్థానాల్లో గెలిచి చూపిస్తాం...10 సీట్లు గెలవకపోతే తాను ఎమ్మెల్యేగా...

నల్గొండలో జిల్లాలోని 12 స్థానాలకు 10 స్థానాల్లో గెలిచి చూపిస్తాం...10 సీట్లు గెలవకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచినా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నల్గొండ సభలో కేసీఆర్ పూర్తిగా అబద్ధాలు మాట్లాడారని విమర్శించిన ఆయన... అభద్రతా భావంతోనే కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... సాగర్ ద్వారా 10 లక్షలు ఎకరాలకు కాంగ్రెస్‌ హయాంలోనే నీరు ఇచ్చామన్నారు. జగదీశ్‌రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకే దామరచర్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారని అని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దామరచర్ల ప్లాంట్‌ను ఆపేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 30 వేల కోట్లు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీలో కమీషన్ రాదనే పట్టించుకోలేదన్నారు. రౌడీలకు, దోపిడీదారులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారని, రౌడీలను గెలిపిస్తే నల్గొండలో నిత్యం హత్యలు, దోపిడీలే అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story