పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

nanireddy
Updated on: 24 Dec 2018 4:40 PM IST
పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
X

కాంగ్రెస్‌ నేత, మునుగోడు శాసనసభ్యుడిగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సోమవారం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మునుగోడు నుంచి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్ కు అందించారు. ఇదిలావుంటే తెరాస ఎమ్మెల్సీలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేంద్రరెడ్డి, మల్కాజ్గిరి నుంచి గెలిచిన మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అలాగే మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. మల్లారెడ్డి మేడ్చల్, బాల్కసుమన్ చెన్నూరు అసెంబ్లీ స్థానంనుంచి విజయం సాధించారు.

nanireddy

nanireddy

Next Story