మరో మాజీ ఎమ్మెల్యేను త్వరలోనే చంపేస్తారు!

మరో మాజీ ఎమ్మెల్యేను త్వరలోనే చంపేస్తారు!
x
Highlights

సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. మిర్చి బండి దగ్గర కొట్లాట వల్లే నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త...

సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. మిర్చి బండి దగ్గర కొట్లాట వల్లే నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారన్న నివేదికపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో జరుగుతున్న వరుస హత్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా చంపేస్తారని అన్నారు. ఈ విషయం డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసీఆర్ దోపిడీ రాజ్యానికి అండగా ఉండటానికే పోలీసులు ఉన్నారా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసును సీబీఐకి సిఫారసు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఈ కేసు వెనుక సీఎం హస్తం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories